సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం

Gun Fire in Sangareddy district .. సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. భూ వివాదంలో

By సుభాష్  Published on  16 Nov 2020 2:16 PM GMT
సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం

సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. భూ వివాదంలో చోటు చేసుకున్న ఘర్షణ ఒక వర్గం వారు మరో వర్గంపై కాల్పులకు పాల్పడ్డారు. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు అయ్యాయి. సంగారెడ్డి పరిధిలోని జహీరాబాద్‌ మండలంలోని గోవిందపూర్‌ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు పది కోట్ల రూపాయల విలువైన సుమారు 30 ఎకరాల భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన కమల్‌ కిశోర్‌ పల్లాడి గోవిందపూర్‌ శివారులోని జీడిగడ్డతండా గ్రామంలోని 104, 105 సర్వే నెంబర్‌లోని 31 ఎకరాల భూమిలో 15 మంది కూలీలతో కడీలు వేయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్‌కు చెందిన అలీ అక్బర్‌, అస్రద్‌లు జీడిగడ్డతండాకు వెళ్లారు. అయితే సర్వే నంబర్‌ 109లో అలీ అక్బర్‌ భూమి ఉంది. కమల్‌ కిశోర్‌ పల్లాడ్‌ కడీలు వేయించే భూమిలో కూడా తమ భూమి ఉదంంటూ అలీ అక్బర్‌ వర్గం ఘర్షనకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదం పెద్దదైంది.

అక్రమంలో అలీఅక్బర్‌ జహీరాబాద్‌కు చెందిన లాయక్‌ అనే రౌడీసీటర్‌కు ఫోన్‌ చేసి పిలిపించి, వాహనంలో ఆయుధాలతో చేరుకున్న లాయక్‌ కర్రలు, కత్తులతో కమల్‌ కిశోర్‌ వర్గంపై దాడికి దిగారు. తుపాకీలో గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో భయంతో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు అయ్యారు. కమల్‌ కశోర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రౌడీషీటర్ లాయక్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, లాయక్‌పై జహీరాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచారు. 2018లో ఓ హత్యకు సంబంధించి లాయక్‌పై కేసు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Next Story
Share it