తల్లిని హత్యచేసి 'సారీ మామ్' అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన యువకుడు

గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.

By Srikanth Gundamalla  Published on  31 Aug 2024 2:52 AM GMT
Gujarat, son, kill,  mother,  photo,  social media ,

 తల్లిని హత్యచేసి 'సారీ మామ్' అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన యువకుడు

గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి సారీ మామ్‌ నేను నిన్ను కోల్పోయాను అంటూ రాసుకొచ్చాడు. ఈ సంఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. కాగా.. నిందితుడిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ యూనివర్సిటీ రోడ్‌లో జ్యోతిబెన్‌ (48) అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. చాలా కాలంగా ఆమె మందులను వాడుతోంది. అయితే.. ఈమెకు 21 ఏళ్ల కొడుకు నీలేశ్ ఉన్నాడు. తల్లికి, కొడుకుకి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 20 ఏళ్ల క్రితమే భర్తతో విడిపోయింది జ్యోతిబెన్. అప్పటి నుంచి వేరుగానే ఉంటోంది. అయితే.. ఇటీవల మరోసారి నీలేశ్‌కు తన తల్లికి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంలో నీలేశ్‌ తల్లిపై దాడికి తెగబడ్డాడు. కత్తితో పొడిచాడు.ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో.. ఆమెపై దుప్పటి కప్పి పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత తల్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. , "సారీ అమ్మ నేను నిన్ను చంపుతాను, నేను నిన్ను కోల్పోతున్నాను, ఓం శాంతి". మరో పోస్ట్‌లో, "ఐయామ్ కిల్ మై మామ్, లాస్ మై లైఫ్, సారీ మామ్, ఓం శాంతి, మిస్ యూ మామ్" అని రాశాడు.

జ్యోతిబెన్ కొన్నాళ్లుగా తీవ్ర మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని, దీంతో ఆమె కొడుకుతో తరచూ వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకునేవని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. ఈ సంఘటనకు జ్యోతిబెన్ నెల నుంచి మానసిక అనారోగ్యానికి తీసుకుంటున్న మందులను ఆపేసింది. మరోవైపు జ్యోతిబెన్‌ మృతదేహాన్ని తీసుకెళలేందుకు మాజీ భర్త ముందుకు రాలేదు. మిగతా సంతానం కూడా నిరాకరించారు. మరోవైపు ప్రస్తుతం నీలేశ్‌ ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.

Next Story