కృష్ణా జిల్లా గుడివాడ టౌ టౌన్‌లో ఎస్ఐగా విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ పిల్లి విజ‌య్‌కుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. త‌న అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈయ‌న ఆత్మ‌హ‌త్య‌కు వివాహేత‌ర సంబంధ‌మే కార‌ణ‌మై ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈయ‌న‌కు రెండు నెల‌ల కింద‌టే వివాహమైంది. అయితే.. భార్య‌ను కాపురానికి తీసుకురాకుండా గుడివాడ‌లో ఓ బ్యూటీషియ‌న్‌తో క‌లిసి ఉంటున్న‌ట్లు తెలుస్తోంది.

హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమె పరిచయం కావడంతో అప్పటి నుంచి ఆమెతోనే ఉంటున్నట్టు చెబుతున్నారు. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలోనే గ‌తంలో స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. సస్పెన‌ష‌న్ త‌రువాత గుడివాడ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలోని పీఎస్‌లో ఎస్ఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఎస్సై మృత‌దేహాన్ని గుడివాడ ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై గుడివాడ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story