తొలి రాత్రే ఉరివేసుకున్న వరుడు

Groom commits suicide on first night in Nalgonda.మేన‌మామ కూతురినే వివాహాం చేసుకున్నాడు. పెళ్లై 11 రోజులు అయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jan 2021 11:21 AM IST
తొలి రాత్రే ఉరివేసుకున్న వరుడు

మేన‌మామ కూతురినే వివాహాం చేసుకున్నాడు. పెళ్లై 11 రోజులు అయింది. తొలి రాత్రి కోసం అంతా సిద్దం చేశారు. అయితే.. ఏం జ‌రిగిందో.. ఏం క‌ష్టం వ‌చ్చిందో తెలియ‌దు. ఫ‌స్ట్ నైట్ రోజే ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా శాలిగౌరారం మండ‌లం మ‌నిమ‌ద్దె గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

పోలీసులు తెలిపిన ప్రకారం.. మ‌నిమ‌ద్దె గ్రామానికి చెందిన గోళ్ల అంతమ్మ చిన్నకుమారుడు సోమేశ్‌ అలియాస్‌ సోమయ్య (27)కు నాగారం మండలం ఫణిగిరికి చెందిన మేనమామ కూతురుతో ఈనెల 3న వివాహం జ‌రిగింది. వారి సంప్ర‌దాయం ప్ర‌కారం 11వ రోజు మంగ‌ళ‌వారం రాత్రి శోభ‌నానికి ఏర్పాట్లు చేశారు. స్నేహితుల‌ను క‌లిసి వ‌స్తాన‌ని చెప్పి సోమ‌య్య బ‌య‌టికి వెళ్లాడు.ఎంత‌సేప‌టికి తిరిగి రాలేదు. చాలా సార్లు ఫోన్ చేసినప్ప‌టికి స్పంద‌న లేక‌పోవ‌డంతో కుటుంబ సభ్యులు ఆందోళ‌న చెందారు. స్నేహితుల‌ను వాక‌బు చేయ‌గా.. ఇంటికే వెళ్లార‌ని వారు చెప్పారు. దీంతో చుట్టు ప‌క్క‌ల వెతుగ‌గా.. నిరుప‌యోగంగా ఉన్న పూరింట్లోకి వెళ్లి తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వ‌రుడు మృతిచెంద‌డంతో.. ఆ కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.




Next Story