అనంత‌పురం జిల్లాలో దారుణం.. వాలంటీరు దారుణ‌హ‌త్య‌.. తండ్రిని చంప‌బోయి..!

Grama Volunteer Murdered in Ananthapur dist.అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొలం వ‌ద్ద నిద్రిస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2021 5:38 AM GMT
అనంత‌పురం జిల్లాలో దారుణం.. వాలంటీరు దారుణ‌హ‌త్య‌.. తండ్రిని చంప‌బోయి..!

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొలం వ‌ద్ద నిద్రిస్తున్న వాలంటీరును దారుణంగా హ‌త్య చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. కూడేరు మండ‌లం శివ‌రాం పేట గ్రామానికి చెందిన శ్రీకాంత్.. వాలంటీరుగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. గ‌త రాత్రి పొలం వ‌ద్ద ఆయ‌న నిద్రించగా.. కొంద‌రు దుండ‌గులు దారుణంగా హ‌తమార్చారు. ఉద‌యం అటుగా వెలుతున్న గ్రామ‌స్తులు శ్రీకాంత్ మృత‌దేహాన్ని గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అర్థ‌రాత్రి స‌మ‌యంలో గున‌పంతో పొడిచి హ‌త్య చేసిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు.

మృత‌దేహాన్ని ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం అనంత‌పురం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. శ్రీకాంత్ తండ్రిని చంప‌బోయి కుమారుడిని చంపిన‌ట్లు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ తండ్రి గ్రామంలోని చాలా మందితో త‌రుచూ గొడ‌వ‌లు ప‌డేవాడ‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఆ పాత కక్షల కారణంగా హత్య జరిగిందా.. లేక మరెవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it