సిలిండ‌ర్ పేలి 13 మందికి తీవ్రగాయాలు

Gas Cylinder explosion in Mangolpuri.ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2021 10:53 AM IST
సిలిండ‌ర్ పేలి 13 మందికి తీవ్రగాయాలు

ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. మంగోల్‌పురి ప్రాంతంలో ఓ ఇంటిలో గ్యాస్ సిలిండ‌ర్ భారీ శ‌బ్దంతో పేలింది. దీంతో ఉవ్వెత్తున మంట‌లు ఎగిసి పడ్డారు. స్థానికులు గ‌మ‌నించిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. మూడు ఫైర్ ఇంజ‌న్లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ప్ర‌మాదంలో 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ‌గా.. వారంద‌రిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

గంటల వ్యవధిలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. అయితే గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ సంఘటన జరిగిందని ఆయన ధృవీకరించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది వివరించారు. ఈ ప్రమాదంలో ఇంకా ఆస్తినష్టం ఎంత జరిగిందో తెలియరాలేదన్నారు.

Next Story