దారుణం.. ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Gang raped by Robbers near Mysore.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2021 9:47 AM ISTదేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో దారుణం జరిగింది. ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడి కళ్లెదుటే యువతిపై ఈ దారుణానికి ఒడిగట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు మైసూరుకు చెందిన ఎంబీఏ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి మంగళవారం సాయంత్రం నగరానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లింది. ఆ ఆలయానికి సమీపంలో ఆరుగురు వ్యక్తుల ముఠా వీరిని చుట్టుముట్టింది. డబ్బులు, నగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు వీరు నిరాకరించడంతో.. ఆ దొంగల ముఠా వీరిపై దాడికి పాల్పడ్డారు. యువకుడిని తీవ్రంగా కొట్టారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి ఆ ముఠా పరారు అయ్యారు.
స్నేహితుడి సాయంతో ఆస్పత్రికి చేరుకున్న యువతి చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీసీ ప్రదీప్ గుంటి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న ఆ ముఠా కోసం గాలింపు చేపట్టారు. కాగా.. ఈ ఘటనపై సీఎం బసవరాజ్ బొమ్మె తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. యువతి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశామని నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.