మద్యం తాగించి..హోటల్‌లో పనిచేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం
ఆగ్రాలోని ఓ హోమ్‌స్టే ఉద్యోగిపై దాడి చేసి, బలవంతంగా మద్యం తాగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 4:24 PM ISTమద్యం తాగించి..హోటల్‌లో పనిచేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆగ్రాలోని ఓ హోమ్‌స్టే ఉద్యోగిపై దాడి చేసి, బలవంతంగా మద్యం తాగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సహాయం కోసం ఆమె ఏడుస్తున్నట్లు ఆరోపించిన వీడియో ఒకటి బయటపడింది. ఒక మహిళ సహా ఐదుగురిని అరెస్టు చేశారు.
ఆగ్రాలోని ఓ హోమ్‌స్టేలో పనిచేసే మహిళ ఉద్యోగిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి తమకు కాల్ వచ్చిందనీ.. దాంతో వెంటనే స్పందించి ఘటనాస్థలికి చేరుకుని మహిళను కాపాడినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాగిన మైకంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది. అంతేకాదు.. తనను బలవంతంగా గదిలో బంధించి దారుణంగా కొట్టారని పోలీసులకు చెప్పింది. నిందితులు బలవంతం చేసి మద్యం తాగించారని వెల్లడించింది. ఆపై తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులతో తెలిపింది బాధితురాలు. దాంతో.. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఓ మహిళతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఆగ్రా పోలీసులు వెల్లడించారు. అయితే.. ఘటనకు పాల్పడిన సమయంలో బాధితురాలిపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు ఉన్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది.
మరోవైపు గాయాలపాలైన బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేయిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆగ్రా పోలీసులు చెప్పారు.