మైనర్ బాలికపట్ల శాపంగా మారిన పవర్ కట్
Gang Rape minor girl in Nellore district.ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 16 Oct 2021 3:07 PM ISTఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు వయస్సుతో సంబంధం లేకుండా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక పెరుగు ప్యాకెట్ కోసం బయటకు వెళ్లగా.. నలుగురు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కొండాపురంలోని అరుంధతివాడలో ఓ కుటుంబం నివసిస్తోంది. చుట్టు ప్రక్కలా ఎలాంటి షాపులు కూడా లేవు. దీంతో ఏ వస్తువు కావాలన్నా పక్కనే ఉన్న రామానుజపురం వెళ్లాల్సి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసేందుకు ఆ ఇంట్లోని వారు సిద్దం అయ్యారు. పెరుగు ప్యాకెట్ లేకపోవడంతో మైనర్ బాలికను దాన్ని తీసుకురావాలని చెప్పడంతో ఆ బాలిక రామానుజపురం వెళ్లింది. పెరుగు ప్యాకెట్ తీసుకుని తిరిగి వస్తున్న క్రమంలో.. గ్రామంలో కరెంట్ పోయింది. ఇదే అదునుగా బావించి.. ఆ బాలికపై కన్నేసిన నలుగురు యువకులు.. ఆ బాలికని ఊరి చివర ఉన్న చెరువు వద్దకు తీసుకుపోయారు. బాలిక అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి.. చేతులను కాళ్లను కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలిక మూగువులు ఉన్న స్థానికులు చెరువు కట్ట వైపుకు రాగా.. ఆ యువకులు వారిని చూసి పారిపోయారు. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను సైతం పట్టుకున్నట్లుగా తెలుస్తుండగా.. స్థానికంగా ఉన్న ఓ నేత కేసును నీరు గార్చేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.