గుంటూరుజిల్లాలో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం
Gang Rape in Sattenapalle.గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెలుతున్న
By తోట వంశీ కుమార్ Published on 9 Sept 2021 9:50 AM IST
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెలుతున్న దంపతులను అడ్డుకున్న కొందరు దుండగులు.. కత్తులతో వారిని బెదిరించి భర్తపై దాడి చేసి అనంతరం భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి మేడికొంటూరు అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు.. గుంటూరు పట్టణంలోని ఓ పెళ్లికి హాజరై తిరిగి బైక్‌పై వెలుతున్నారు. మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలోకి వచ్చేసరికి వారిని కొందరు దుండగులు అడ్డగించారు. కత్తులతో వారిని బెదిరించారు. భర్తపై దాడి చేశారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. షాక్ నుంచి తేరుకున్న అనంతరం దంపతులు అర్థరాత్రి ఫిర్యాదు చేసేందుకు సత్తైనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.
అయితే.. ఈ ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ పరిధిలోకి వస్తుందని.. ఫిర్యాదు తీసుకోబోమని పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు వెనుదిరిగి మేడికొండూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా.. ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీచేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.