ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
Four Members of a family commit suicide in Rajamandry I ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
By సుభాష్ Published on
23 Nov 2020 12:28 PM GMT

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రిలోని అంబేద్కర్ నగర్ రామాలయం వీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లి, కూతురు ఉరివేసుకున్నారు. మృతులు సంగిరెడ్డి కృష్ణవేణి (55), కుమార్తె శివపావని (26), నిషాంత్ (9), రితిక (8)లుగా గుర్తించారు.
కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. శివపావని భర్త రెండో పెళ్లి చేసుకోవడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story