విషాదం.. నీటిలో మునిగి న‌లుగురు మృతి

Four Family members were inundated in Manjeera River.కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దైవ ద‌ర్శ‌నం కోసం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 26 Jun 2021 12:31 PM IST

విషాదం.. నీటిలో మునిగి న‌లుగురు మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దైవ ద‌ర్శ‌నం కోసం బీర్క‌రూరు శివారులోని మంజీరా న‌దిని దాటుతుండ‌గా న‌లుగురు మృతి చెందారు. వివ‌రాల్లోకి వెళితే..కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూరుకు చెందిన గంగారాం, మారుతీ అన్నదమ్ముల కుటుంబం. కాగా.. దైవ‌ దర్శనానికి నిన్న సాయంకాలం బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో మంజీర నది దాటుతుండగా నలుగురు గల్లంతయ్యారు. అయితే.. వారిని కాపాడేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిచిన ఫలితం లేకుండా పోయింది.

ఈరోజు పోలీసులు గజ ఈతగాళ్లు సహాయం తో మృతదేహాలను బయటకుతీశారు. మృతుల్లో అంజవ్వ(40), జ్యోతి తల్లి కూతుళ్లు కాగా.. గంగోత్రి, ప్రశాంత్ అక్క తమ్ముడు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. కొద్ది నెలల కిందట మంజీరా నదిలో ఇసుక తవ్వకాలతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. ఈ క్రమంలో కాలినడకన నది దాటుతుండగా.. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Next Story