దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై తండ్రి అఘాయిత్యం
Five years Old Daughter raped by father in Vijayawada.ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై
By తోట వంశీ కుమార్ Published on 9 Sept 2021 8:09 AM ISTఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అభం శుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కుమారైను కాపాడిల్సిన కన్న తండ్రే.. కుమారై పట్ల నీచానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
విజయవాడ నగరంలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇనిస్టిట్యూట్‌తో పాటు మరో ఇంజినీరింగ్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా నిందితుడు పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. నున్న మ్యాంగో మార్కెట్ సమీపంలో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అతడు ఏ తండ్రి చేయకూడని పని చేశాడు. భార్య ఇంట్లో లేని సమయంలో తన ఐదేళ్ల కుమారై పై అత్యాచారానికి ఒడి గట్టాడు.
పాపం ఆ చిన్నారి తీవ్రమైన బాధతో విలవిలలాడింది. కూతురు బాధ పడుతుంటే.. ఏమైందని ఆ తల్లి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆగ్రహాంతో ఊగిపోయిన ఆమె.. వెంటనే విజయవాడ దిశ పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు విషయం తెలుసుకుని నిందితుడు పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.