పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో అపశృతి.. ఐదుగురు కార్మికులు మృతి

Five workers died in Palamuru lift works in Kolhapur.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2022 8:58 AM IST
పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో అపశృతి.. ఐదుగురు కార్మికులు మృతి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పంపు హౌస్‌లోకి క్రేన్ సాయంతో దిగుతుండ‌గా క్రేన్ వైర్ తెగి ఐదుగురు కార్మికులు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న కొల్లాపూర్ మండ‌లం ఏలూరు శివార్ల‌లోని రేగ‌మ‌న‌గ‌డ్డ వ‌ద్ద చోటుచేసుకుంది.

పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో రేగమనగడ్డ వద్ద పంపు హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలో క్రేన్ సాయంతో పంపు హౌస్‌లోనికి కార్మికులు దిగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు అంతా అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతులంగా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వ్య‌క్తిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తుండ‌గా.. మృత‌దేహాల‌ను ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story