దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
ఛత్తీస్గఢ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 2:45 PM GMTదారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
ఛత్తీస్గఢ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో తార్గావ్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురుని హత్య చేశాడు ఒక నిందితుడు. మృతులందరి ఒంటరిపై గొడ్డలి గాట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతదేహాలు లభ్యం అయిన ఇంటి పక్కన చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తార్గావ్ గ్రామంలోని ఓ ఇంట్లో హేమ్లాల్ సాహు (55) అనే వ్యక్తి.. తన భార్య జగ్మోతి సాహు (50) నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తెలు మమతా సాహు (35), మీరా సాహు (30), వారి మనుమడు (5)తో పాటుగా మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం హేల్లాల్ అతని భార్య, ఇద్దరు కుమార్తెలతో పాటు మనమడు ఇంట్లో విగతజీవులుగా పడిఉన్నారు. ఇక వీరి ఇంటికి దగ్గరే అదే గ్రామానికి చెందిన మనోజ్ సాహు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐదుగురు అనుమానాస్పదంగా చనిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. మనోజ్ సాహుది ఆత్మహత్యగా రాసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే లభ్యమైన మృతదేహాలపై గొడ్డలి గాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉరివేసుకుని చనిపోయిన మనోజ్..ఈ ఐదుగురిని చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామనీ.. దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.