విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

By Srikanth Gundamalla  Published on  15 Dec 2023 10:30 AM IST
family, mass suicide, rajasthan,

విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు.. దంపతులు ఉన్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది.

పూర్తి వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లా ముక్తప్రసాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. అంత్యోదయ నగర్‌లో హనుమాన్‌ సోని, తన భార్యతో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి అద్దెకు ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఏం సమస్య వచ్చిందో తెలియదు కానీ.. కుటుంబం మొత్తం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. డోర్స్‌ లాక్‌ చేసి ఉండటంతో ఎవరూ చూడలేదు. రెండ్రోజులకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దాంతో.. అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో నుంచి కుటుంబం బయటకు రావడం లేదని.. పైగా ఇప్పుడు దుర్వాసన వస్తోందని చెప్పడంతో ముక్తప్రసాద్ పోలీసులు అక్కడికి వెళ్లారు.

ఆ తర్వాత పోలీసులు ఇంటి తలుపులను పగలగొట్టారు. లోనికి వెళ్లి చూడగా ఇద్దరు దంపతులతో పాటు.. ముగ్గురు పిల్లలు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. ఇది చూసిన పోలీసులతో పాటు.. స్థానికులు షాక్‌ అయ్యారు. మొత్తం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడంతో విషాదచాయలు అలుముకున్నాయి. ఇక తర్వాత పోలీసులు మృతదేహాలను కిందకు దించి.. పోస్టుమార్టం కోసం పీబీఎం ఆస్పత్రికి తరలించారు. మృతులు.. హనుమాన్ సోని (45), భార్య విమల (40), కుమారుడు మోహిత్ (18), రిషి (16), కూతురు గుడియా (14)గా పోలీసులు తెలిపారు. గురువారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు పోలీసులు. అయితే.. వారంతా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఇక పోస్టుమార్టం తర్వాత ఎప్పుడు చనిపోయారు అనే విషయం తేలుతుందని చెప్పారు. పూర్తి విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు ముక్తప్రసాద్ పోలీసులు.

Next Story