క‌రోనా ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. న‌లుగురు రోగుల మృతి

fire accident at covid hospital in Thane.తాజాగా థానేలో ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో అగ్నిప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌నలో న‌లుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2021 7:52 AM IST
fire accident in Thane

దేశంలో ఓ వైపు క‌రోనా విల‌య‌తాండవం చేస్తుంటే.. మ‌రోవైపు అగ్నిప్ర‌మాదాలు భ‌య‌పెడుతున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో అగ్నిప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌నలో న‌లుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానేలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. థానేలోని ప్రైమ్ క్రిటికేర్ ఆస్ప‌త్రిలో ఈరోజు(బుధ‌వారం) తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆస్ప‌త్రిలోని ఐసీయూలో మంట‌లు చెల‌రేగాయి. ఆ స‌మ‌యంలో ఆస్ప‌త్రిలోని ఐసీయూలో ఎనిమిది మంది ఉన్నారు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. అనంత‌రం రోగుల‌ను మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. న‌లుగురు మృతి చెందారు. అక్క‌డికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌లను అదుపులోకి తెచ్చారు.

థానే మున్సిప‌ల్ అధికారి వెల్ల‌డించిన వివ‌రాల మేరకు.. థానేలోని ఫ్రైమ్ క్రిటికేర్ ఆస్ప‌త్రిలో ఈ రోజు తెల్ల‌వారు జామున అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రోనా, ఇత‌ర రోగుల‌ను మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాప‌క సిబ్బంది వ‌చ్చి మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు అని తెలిపారు. కాగా.. రెండు రోజుల క్రితం కూడా థానేలోని వేదాంత్ ఆస్ప‌త్రిలో ప్రాణ‌వాయువు(ఆక్సిజ‌న్‌) కొర‌త కార‌ణంగా ఐదుగురు క‌రోనా బాధితులు మృతి చెందిన విష‌యం తెలిసిందే.

మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని ముంబ్రా ప్రాంతంలో గల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలోని ఐసీయూలో మంటలు వ్యాపించాయి. దీంతో బాధితులు హాహాకారాలు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలోని ఐసీయూలో ఎనిమిదిమంది బాధితుల ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.


Next Story