కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం

Fire breaks out in fishing boat in Kakinada.తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2021 4:14 PM IST
Fire breaks out in fishing boat in Kakinada

తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తికి తీవ్ర‌గాయాల‌వ్వ‌గా.. మ‌రో ముగ్గురికి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వివ‌రాల్లోకి వెళితే.. కాకినాడ‌లోని ఏటిమొగ‌కు చెందిన పంతాటి కామేశ్వ‌ర‌రావు త‌న బోటులో సుమారు 4వేల లీట‌ర్ల డీజిల్ నింపుకుని చేప‌ట వేట‌కు వెళ్లేందుకు సిద్ద‌మ‌మ‌య్యాడు.

అయితే.. ఆయిల్ లీక్ అవ్వడంతో బోటు మోటార్ ఆన్ చేసే సమయంలో మంటలు చెలరేగాయి. వెంట‌నే స్పందించిన అధికారులు మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి ఫ‌లితం లేకుండా పోయింది. బోటు పూర్తిగా దగ్ధ‌మైంది. ఈ ప్ర‌మాదంలో విశాఖ‌కు చెందిన బొడ్డు నూక‌రాజుకు తీవ్ర‌గాయాలు కాగా.. మ‌రో ముగ్గురికి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. వెంట‌నే వారిని కాకినాడ జీజీహెచ్‌కు త‌ర‌లించారు. దీనిపై కాకినాడ పోర్టు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.




Next Story