32 ఏళ్ల కన్నడ నటిని మహిళల టాయిలెట్‌లో రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన వెలుగుచూసింది. బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపులు, సైబర్ దోపిడీకి సంబంధించిన కేసు నమోదైంది. బెంగళూరులోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి హాజరైనప్పుడు గుర్తు తెలియని వ్యక్తి తనకు తెలియకుండానే తన అశ్లీల వీడియోను రికార్డ్ చేశాడని నటి ఆరోపించారు.
ఈ సంఘటన ఫిబ్రవరి నెలలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 7న స్టేడియంలోని మహిళల టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు తనను రహస్యంగా చిత్రీకరించారని నటి ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాత నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీడియోను అప్లోడ్ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. నిందితుడు మరిన్ని ప్రైవేట్ వీడియోలను విడుదల చేస్తామని బెదిరించడం ప్రారంభించాడు. డబ్బు కూడా డిమాండ్ చేశాడని నటి ఆరోపించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది, పోలీసు అధికారులు నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బెదిరింపులకు తెగబడిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మూలాన్ని ట్రాక్ చేయడానికి పనిచేస్తున్నారు.