Hyderabad: రూ.10 కిరాయి కోసం ఘర్షణ.. ఆటో డ్రైవర్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. 10 రూపాయల కోసం ఇద్దరు గొడవపడ్డారు.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 4:30 AM GMTHyderabad: రూ.10 కిరాయి కోసం ఘర్షణ.. ఆటో డ్రైవర్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. 10 రూపాయల కోసం ఇద్దరు గొడవపడ్డారు. ఈ ఘర్షణ ఒకరి ప్రాణం తీసే వరకూ వెళ్లింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగోకి వచ్చింది. ఆటో కిరాయి కోసం ఓ బాలుడిని నిలదీశాడు ఆటో డ్రైవర్. అయితే.. తన వద్ద లేవనీ.. కొంత దూరానికే ఎందుకు 20 రూపాయలు ఇవ్వాలని గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి ఇద్దరు కొట్టుకునే వరకూ వెళ్లింది.
ఫలక్‌నుఆ వట్టేపల్లికి చెందిన మహ్మద్ అన్వర్ (37) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 12వ తేదీన ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు ఫలక్‌నుమా నుంచి షంషీర్‌గంజ్ వరకు అన్వర్ ఆటో ఎక్కి ప్రయాణం చేశాడు. ఆటో దిగిన తర్వాత కిరాయిగా రూ.10 ఇచ్చాడు. అయితే.. 10 రూపాయలు కాదు.. రూ.20 ఇవ్వాలని ఆటో డ్రైవర్ అన్వర్ డిమాండ్ చేశాడు. దానికి బాలుడు తన దగ్గర డబ్బులు లేవనీ.. ఈ మాత్రం దానికే 20 రూపాయలు ఎందుకు తీసుకుంటావంటూ నిలదీశాడు. దాంతో.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో బాలుడు అన్వర్‌ను ఒక్కసారిగా బలంగా తోసేశాడు. అతను కిందపడిపోయాడు.
అన్వర్ కిందపడిన సమయంలో తలకు తీవ్ర గాయం అయ్యింది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో చికిత్స పొందిన అన్వర్ జూన్ 28న ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన చర్చనీయాంశం అయ్యింది. రూ.10 కోసం గొడవ పెట్టుకోవడం.. తర్వాత ఒకరి ప్రాణాలు తీయడం దారుణమటున్నారు.