ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 4 March 2024 10:31 AM ISTముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి ముగ్గురు పిల్లలను చంపేశాడు. ఆ తర్వాత ఉరివేసుకుని తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. శంకర్‌పల్లి మండలంలోని టంగుటూరులో చోటుచేసుకుంది.
టంగుటూరులో ఉంటోన్న రవి అనే వ్యక్తి ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో టంగుటూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని పలువురి వద్ద మనీ స్కీమ్ పేరుతో డబ్బులు కట్టించాడు. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే వెయ్యి రూపాలకు రూ.300 వస్తాయనీ చెప్పాడు. 58 రోజుల్లో రూ.లక్ష వరకు ఇప్పిస్తానంటూ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మనీస్కీమ్‌లో పెట్టించాడు. అయితే.. తారా డబ్బులు వారికి అందలేదు. దాంతో.. బాధితులంతా రవిని నిలదీయడం మొదలుపెట్టారు. డబ్బులు కట్టిన ప్రతి ఒక్కరు ఏమైందంటూ నీలదీయడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. తిరిగి వారు డబ్బులు అడగడం.. రవి తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉండటంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికే ఉండటం.. మనీస్కీమ్ ద్వారా మరిన్ని డబ్బులు తీసుకోవడంతో పూర్తిగా అప్పులో మునిగిపోయాడు. తేరుకోలేనని గ్రహించాడు. ఒకవైపు అప్పులు తీర్చలేకపోవడం, మరోవైపు మనీస్కీం ద్వారా మోసపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలను చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా పంటపొలం వద్దకు వెళ్లి అక్కడున్న ఒక షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లారు. పిల్లల మృతదేహాలతో పాటు.. తండ్రి డెడ్‌బాడీని కూడా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.