కుమార్తె మానసిక వికలాంగురాలు.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే
Father Misbehave with daughter in Chandigarh.హర్యానాలోని రోహ్‌తక్‌లో మానసిక వికలాంగురాలైన కుమార్తెపై అత్యాచారానికి
By M.S.R Published on 20 Dec 2021 12:51 PM ISTహర్యానాలోని రోహ్‌తక్‌లో మానసిక వికలాంగురాలైన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు చేసిన నీచానికి బాధితురాలు 4 నెలల గర్భిణి అని తేలింది. పిండం డీఎన్‌ఏను నిందితుడి డీఎన్‌ఏతో పోలీసులు సరిచూసినప్పుడు ఈ విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరు పరిచిన పోలీసులు అతడిని జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం జైలుకు తరలించారు. బాలికను అధికారుల సంరక్షణకు పంపారు.
సంప్లా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి తన కుటుంబంతో సహా సంప్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 10, 2021 న అతను తన భార్య చనిపోయిందని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొడుకు ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఇంట్లో 30 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. అనారోగ్యం కారణంగా అతడి కుమార్తెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ కుమార్తె 4 నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. న్యాయ సలహా మేరకు వైద్యులు బాలికకు అబార్షన్ చేయించారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో బాలిక తండ్రిపై అనుమానం వచ్చింది. అతడిని విచారణలో చేర్చారు. దీంతో బాలికకు, బాలిక తండ్రికి, పిండానికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. ఆ డీఎన్‌ఏ పరీక్ష రిపోర్టులు వచ్చాయి. బాలికపై ఆమె తండ్రే అత్యాచారం చేశాడని నివేదిక వెల్లడించింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య మరణంపై కూడా ఇప్పుడు అనుమానాలు బలపడుతూ ఉన్నాయి.