దారుణం.. భార్యపై అనుమానం.. ఇద్దరు చిన్నారులను చంపి.. ఆపై తండ్రి ఏం చేశాడంటే..?
Father Commits Suicide after killing Two children.అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డలను
By తోట వంశీ కుమార్ Published on 24 Dec 2021 6:08 AM GMT
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డలను హత్య చేసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దామరచర్ల మండలంలోని మూనావత్ తండాలో కిషన్ నాయక్(35), భూలక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి హర్షవర్థన్(8), అఖిల్(6) సంతానం. కాగా.. కిషన్ నాయక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే.. కొద్దిరోజులు క్రితం భార్య ప్రవర్తనపై కిషన్ నాయక్ కు అనుమానం కలిగింది. అప్పటి నుంచి ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. గురువారం సాయంత్రం ఇద్దరు చిన్నారులకు బట్టలు కొనిస్తానంటూ ఆటోలో వారిని కిషన్ నాయక్ తీసుకువెళ్లాడు. అనంతరం తండా సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకెళ్లి కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి చిన్నారుల చేత తాగించాడు. వారి మృతి చెందిన అనంతరం అక్కడే ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం అటుగా వెళ్లిన కొందరు స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.