నరసాపురంలో విషాదం.. పేలిన గ్యాస్ సిలిండర్.. తండ్రి,కుమారుడు సజీవ దహనం
Father and Son Burnt alive in West Godavari District.పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్
By తోట వంశీ కుమార్ Published on
28 Aug 2021 6:05 AM GMT

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి, కుమారుడు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన నరసాపురం మండలం పెదమైనవానిలంకలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెదమైనవానిలంక గ్రామంలో బొమ్మిడి నాగరాజు(35) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కాగా.. తెల్లవారుజామున నాగరాజు ఇంట్లోంచి పొగలు రావడాన్నిస్థానికులు గుర్తించారు. వెంటనే లోనికి వెళ్లి చూడగా.. నాగరాజుతో పాటు కుమారుడు రోహిత్ (6) విగతజీవులుగా కనిపించారు.
గ్యాస్ సిలిండర్ పేలడంతోనే వారిద్దరు సజీవ దహనం అయినట్లు బావిస్తున్నారు. కాగా.. నాగరాజు భార్య, మరో కుమారుడు బంధువుల వివాహానికి వేరే ఊరుకి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story