ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మహిళా కూలీల మృతి

ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By అంజి
Published on : 17 May 2023 10:00 AM IST

Fatal road accident, Palnadu district, women laborers

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మహిళా కూలీల మృతి

ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామరచర్ల మండలం నరసాపురం నుంచి గురజాల మండలం పులిపాడుకు కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారంతా మహిళలే. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం సమయంలో ఆటోలో 23 మంది కూలీలు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో గురజాల ఆసుపత్రికి తరలించారు. మృతులు నల్గొండ జిల్లా దామర్లచర్ల మండలం నరసపూర్‌కు చెందిన మంజుల (25), పద్మ (27), సక్రి (35), సోని, కవిత (30)గా గుర్తించారు.

Next Story