ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గరుడ బస్సు.. ముగ్గురు దుర్మరణం, 16 మందికి గాయాలు

Fatal road accident in Vanaparthi district.. 3 killed and 16 injured. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరకు లోడుతో వెళ్తున్న

By అంజి  Published on  21 Nov 2022 7:00 AM IST
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గరుడ బస్సు.. ముగ్గురు దుర్మరణం, 16 మందికి గాయాలు

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి గరుడు బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి దగ్గర నేషనల్‌ హైవేపై జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ఉన్నారు. మరణించి వారిలో ముగ్గురు బస్సులో ఉన్నవారు. డ్రైవర్‌, క్లీనర్‌, మరో ప్రయాణికుడు మృతి చెందారు.

హైదరాబాద్‌లోని మియాపూర్‌ డిపోకు చెందిన గరుడ బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ముమ్మాళ్లపల్లి నుంచి అమడబాకుల వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుపై వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు వెంటనే స్పందించి.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Next Story