కారులో ఐదు మృతదేహాలు.. కలకలం రేపుతోన్న ఘటన

తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on  26 Sept 2024 11:55 AM IST
Family, Car, Tamil Nadu, Cops, Suicide

కారులో ఐదుగురి మృతదేహాలు.. కలకలం రేపుతోన్న ఘటన

తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వారి మృతదేహాలు పాడుబడిన కారులో కనిపించాయని పోలీసులు తెలిపారు. తిరుచ్చి-కరైకుడి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం కారు ఆగి ఉంది. మొన్న సాయంత్రం నుంచి నామనసముద్రంలోని అదే స్థలంలో కారు ఆగి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా.. కారులో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.

బాధితులను 50 ఏళ్ల వ్యాపారవేత్త మణికందన్, అతని భార్య నిత్య, తల్లి సరోజ, వారి ఇద్దరు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. మృతులు సేలం నివాసితులుగా గుర్తించినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి. బాధితులు విషం సేవించి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది. కారులోంచి ఓ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని ఆత్మహత్యకు పురికొల్పడానికి కారణమేమిటని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఆర్థిక విషయాల్లో కుటుంబం ఒత్తిడికి గురైందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మెటల్ వ్యాపారంలో ఉన్న మణికందన్ అప్పుల్లో ఉన్నాడని నివేదికలు సూచిస్తున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుదుక్కోట్టై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

Next Story