Hyderabad: బాబా ముసుగులో అత్యాచారాలు, నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో బండ్లగూడలో కీచక బాబా వ్యవహారం వెలుగులో వచ్చింది.
By Srikanth Gundamalla Published on 4 Sep 2023 2:30 PM GMTHyderabad: బాబా ముసుగులో అత్యాచారాలు, నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో బండ్లగూడలో కీచక బాబా వ్యవహారం వెలుగులో వచ్చింది. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు.
టెక్నాలజీ ఇంతగా పెరిగినా కూడా కొంతమంది మూర్ఖంగా నకిలీ బాబాలను నమ్మి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక నవవధువు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను తన అత్తమామలు నకిలీ బాబా వద్దకు తీసుకువెళ్లారు. జూన్ 9వ తేదీన ఆమె వివాహం జరిగింది. పెళ్లయిన నెల రోజులకే నవవధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో అత్త మామ ఇద్దరు కలిసి చికిత్స నిమిత్తం నకిలీ బాబా అయిన మాజర్ ఖాన్ వద్దకు తీసుకువెళ్లారు.. బండ్లగూడలో నివాసముంటున్న మాజర్ ఖాన్ అనే వ్యక్తి యునాని మెడికల్ షాప్ నిర్వాహకుడిగా వ్యవహరించేవాడు. అంతేకాకుండా నకిలీ బాబా అవతారం ఎత్తి ట్రీట్మెంట్ పేరుతో యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
నవ వధువుని అత్తమామలు నకిలీ బాబా వద్దకు చికిత్స నిమిత్తం తీసుకువెళ్లగా..యువతిని ఆ కీచక బాబా మాజర్ ఖాన్ వివస్త్ర చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు అత్యాచారం విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ అది వారు నమ్మలేదు. బాబా చెప్పినట్లుగానే..నవ వధువుకి దెయ్యం పట్టింది అంటూ ఆమెను ఒక రూమ్ లో వేసి బంధించారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి వచ్చి తన కూతుర్ని ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఇక చివరకు భర్తకు విషయం తెలియడంతో బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 19వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. మాజర్ ఖాన్ నకిలీ బాబా అవతారం ఎత్తి ట్రీట్మెంట్ పేరుతో పలువురు మహిళలను యువతులను మోసం చేసినట్లుగా బండ్లగూడ, చాంద్రాయణగుట్, కంచన్‌బాగ్ సహా పలు ప్రాంతాల నుండి పలు ఫిర్యాదులు అందాయి. దాంతో.. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు నకిలీ బాబాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించినట్లు చాంద్రాయణగుట్ట ఏసిపి వెల్లడించారు.