దారుణం.. త‌న పోలిక‌లు లేవ‌ని.. పాప‌ను హ‌త్య చేసిన తండ్రి

Fahter kills Daughter in Anantapur.కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన క‌న్న తండ్రే ఆ చిన్నారి ప‌ట్ల కాల‌య‌ముడు అయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2021 7:56 AM GMT
దారుణం.. త‌న పోలిక‌లు లేవ‌ని.. పాప‌ను హ‌త్య చేసిన తండ్రి

కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన క‌న్న తండ్రే ఆ చిన్నారి ప‌ట్ల కాల‌య‌ముడు అయ్యాడు. అనుమానం అనే పెనుభూతం అత‌డిని ఆవ‌హించింది. పుట్టిన బిడ్డ త‌న పోలిక‌ల‌తో లేదంటూ భార్యతో గొడ‌వ‌ప‌డి మూడు నెల‌ల చిన్నారిని దారుణంగా హ‌త‌మార్చాడు. ఈ విషాద ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. క‌ళ్యాణ‌దుర్గం ప‌ట్ట‌ణంలో మ‌ల్లికార్జున్ త‌న భార్య‌తో క‌లిసి నివ‌సిస్తున్నారు. కాగా.. మూడు నెల‌ల క్రితం అత‌డి భార్య పండంటి ఆడబిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే.. పాప‌ త‌న పోలిక‌ల‌తో ఎందుకు పుట్టలేద‌ని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసేవాడు. ఈక్ర‌మంలో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. ఈ క్ర‌మంలో నిన్న సాయంత్రం మ‌రోసారి భార్య‌భార్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. అనంత‌రం పాపను తీసుకుని మల్లికార్జున్ బ‌య‌ట‌కు వెళ్లాడు. ఎంత‌సేప‌టికి రాక‌పోవ‌డంతో అత‌డి భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఓ సంచిలో పాప మృత‌దేహం క‌నిపించింది. పాప నోటికి ప్లాస్ట‌ర్ వేసి ఊపిరాకుండా చేసి చంపేశాడు. నిందితుడు మ‌ల్లికార్జున కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు.

Next Story
Share it