హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో అపార్టెంట్ లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చంద్రాయణగుట్టలో జరిగింది. లిఫ్ట్ ఐదో అంతస్తు నుంచి కిందకు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. బటన్ నొక్కగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిందని.. లిఫ్ట్ రాకపోవడంతో చూసుకోకుండా కాలు పెట్టి ఐదో అంతస్తు నుంచి పడిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన భవన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.