భార్య క్రెడిట్ కార్డుతో గర్ల్‌ఫ్రెండ్ చ‌లానా కట్టాడు.. ఆత‌రువాత‌

Dubai man uses wifes credit card to pay for girlfriends traffic fines.పెళ్లైన విష‌యాన్ని దాచి ప్రియురాలితో స‌ర‌సాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jan 2021 1:43 PM GMT
భార్య క్రెడిట్ కార్డుతో గర్ల్‌ఫ్రెండ్ చ‌లానా కట్టాడు.. ఆత‌రువాత‌

పెళ్లైన విష‌యాన్ని దాచి ఇటు భార్య‌కు గానీ అటు ప్రియురాలికి గానీ అనుమానం రాకుండా చాలా జాగ్ర‌త్త‌గా చాటుమాటుగా స‌ర‌సాలాడాడు. క్రెడిట్‌ కార్డు అత‌డు చేసిన నిర్వాకాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ప్రియురాలి బండిపై ఉన్న చ‌లాన్లు.. భార్య క్రెడిట్‌తో చెల్లించి అడ్డంగా బుక్కైయ్యాడు. ఈ ఘ‌ట‌న దుబాయ్‌లో జ‌రిగింది. ఓ వ్య‌క్తి భార్య‌కు తెలియ‌కుండా ప్రియురాలిని మొయిన్‌టైన్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. ఇద్ద‌రూ క‌లిసి చెట్టాప‌ట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల కింద‌ట అత‌డి భార్య మొబైల్‌కు ఓ ఎస్ఎంఎస్ వ‌చ్చింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చ‌లాన్లు క‌ట్టినందుకు చాలా సంతోషం అని వ‌చ్చింది.

వెంట‌నే డౌట్ వ‌చ్చింది త‌న హ్యాండ్ బ్యాగ్ వెతికింది. అయితే.. క్రెడిట్ కార్డు క‌నిపించ‌లేదు. ఎవ‌రో దొంగిలించార‌ని భావించింది. దీంతో వెంట‌నే బ్యాంకుకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించింది. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భ‌ర్త ప్రియురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ ఫైన్ల‌ను త‌న ప్రియుడు క‌ట్టాడ‌ని పోలీసుల‌కు చెప్పింది. వెంట‌నే అత‌డిని కూడా స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చారు. అప్ప‌టికిగానీ అస‌లు విష‌యం అర్థం కాలేదు స‌ద‌రు భార్య‌కు. త‌న భ‌ర్త‌.. త‌న ప్రియురాలి కోసం క్రెడిట్ కార్డు వాడాడ‌ని తెలిసింది. అత‌డికి ప్రియురాలు ఉంద‌ని తెలిసి షాకైంది. ఆ కార్డు నీ ప్రియుడి భార్యదని మహిళకు పోలీసులు చెప్పడంతో.. అప్పటికే తన ప్రియుడికి పెళ్లైన విషయం తెలుసుకుని ప్రియురాలికి నోటమాట రాలేదు. దీంతో ఈ రెండిళ్ల పూజారీ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌నే విష‌యం మీకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.


Next Story
Share it