భోపాల్ 'సిస్టర్స్' డర్టీ గేమ్: ఉద్యోగం ఎర.. డ్రగ్స్‌ ఇచ్చి అత్యాచారం.. బుర్ఖా వేసి మత మార్పిడి!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అత్యంత హేయమైన సెక్స్, మత మార్పిడి రాకెట్‌ను పోలీసులు ఛేదించారు.

By -  అంజి
Published on : 25 Feb 2026 7:34 AM IST

Bhopal Sex Racket Busted, Forced Religious Conversion Case, Afreen and Amreen Arrested, Human Trafficking in Bhopal, Drugged and Raped Complaints, Sagar Royal Villas Bhopal Incident, MP Police Investigation, Women Safety Awareness

భోపాల్ 'సిస్టర్స్' డర్టీ గేమ్: ఉద్యోగం ఎర.. డ్రగ్స్‌ ఇచ్చి అత్యాచారం.. బుర్ఖా వేసి మత మార్పిడి!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అత్యంత హేయమైన సెక్స్, మత మార్పిడి రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఒక బ్యూటీషియన్, ఒక పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదులతో ఈ రాకెట్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రాకెట్‌ను ఆఫ్రీన్, అమ్రీన్ అనే ఇద్దరు సోదరీమణులు తమ ముఠాతో కలిసి నడుపుతున్నట్లు తేలింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

వల విసిరే తీరు

ఈ గ్యాంగ్ ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకుంటుంది. వారికి నగరంలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, మొదట వారి నమ్మకాన్ని చూరగొంటారు. ఆ తర్వాత వారిని తమ ఇంటికి తీసుకెళ్లి, మత్తు పానీయాలు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడతారు. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ఈ ముఠా నైజం.

బాధితురాలి కన్నీటి గాథ:

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక 21 ఏళ్ల బ్యూటీషియన్ తన గోడును పోలీసులకు వెళ్లబోసుకుంది. 2025 నవంబర్‌లో అమ్రీన్ తనను తన బంధువుల ఇంటికి తీసుకెళ్లిందని, అక్కడ ఆమె సోదరుడు బిలాల్ తన టీలో మత్తుమందు కలిపి స్పృహ తప్పేలా చేసి రేప్ చేశాడని వివరించింది. ఆ తర్వాత అహ్మదాబాద్‌కు తీసుకెళ్లి యాసిర్ అనే వ్యక్తితో, ఆపై చందన్ యాదవ్ అనే మరో వ్యక్తితో బలవంతంగా శారీరక సంబంధం ఏర్పాటు చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను పొట్టి బట్టలు వేసుకోమని బలవంతం చేస్తూ, పబ్‌లకు తీసుకెళ్లి సంపన్న వ్యక్తులతో గడపాలని ఒత్తిడి చేసేవారని, డ్రగ్స్ కూడా ఇచ్చేవారని బాధితురాలు పేర్కొంది. అంతటితో ఆగకుండా ఆమెను బుర్ఖా ధరించాలని, మతం మారాలని తీవ్రంగా వేధించారు. జనవరిలో అక్కడి నుండి తప్పించుకున్న ఆమె, ఫిబ్రవరి 22న పోలీసులను ఆశ్రయించింది.

మరో మహిళ ఫిర్యాదు:

అమ్రీన్ ఇంట్లో పనిమనిషిగా ఉన్న మరో మహిళ కూడా ఇదే తరహాలో తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసింది. యాసిర్, బిలాల్, చందన్ తనను సామూహిక అత్యాచారం చేశారని చెబుతూ వీడియో సాక్ష్యాలను పోలీసులకు అందజేసింది.

విలాసవంతమైన జీవితం - స్థానికుల అనుమానం:

ఈ నిందితులు భోపాల్‌లోని సంపన్న ప్రాంతమైన సాగర్ రాయల్ విల్లాస్‌లోని విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉండేవారు. నిందితులైన సోదరీమణులు జీన్స్ ధరించేవారని, కానీ వారి ఇంటికి వచ్చే మహిళలు మాత్రం బుర్ఖాలు ధరించి ఉండేవారని పొరుగువారు తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో పురుషులు, యువకులు ఆ ఫ్లాట్‌కు తరచుగా వస్తుండటంతో స్థానికులకు ముందే అనుమానం కలిగింది.

పరిస్థితి ఉద్రిక్తం:

ఈ ఘటనతో భోపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. మహిళల భద్రత కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిందితులపై అత్యాచారం, నేరపూరిత కుట్ర మరియు బలవంతపు మత మార్పిడి చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

Next Story