Hyderabad: రూ.కోటి విలువైన బంగారం స్వాధీనం

దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి నుంచి దాదాపు 1.39 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

By అంజి  Published on  11 Aug 2024 2:07 PM IST
DRI, gold seized, Hyderabad airport, Dubai Flier

Hyderabad: రూ.కోటి విలువైన బంగారం స్వాధీనం

హైదరాబాద్‌: దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి నుంచి దాదాపు 1.39 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ (హెచ్‌జూ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుంది.

కేసు వివరాల ప్రకారం.. ఆగస్టు 9 న నిఘా నివేదికల ఆధారంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అనుమానించిన ఒక పురుష ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టు (ఆర్‌జీఐఏ) వద్ద అడ్డుకున్నారు. ఇంటర్నేషనల్ అరైవల్ హాల్ యొక్క ఎగ్జిట్‌ ప్రాంతం వద్ద ప్రయాణీకుడిని ఆపారు.

ప్రయాణికుడిని విచారించారు. అతని బూట్లు మరియు బ్యాక్‌ప్యాక్‌ను స్కాన్ చేశారు. ఎడమ షూలో, మరొకటి బ్యాక్‌ప్యాక్‌లో దాచిన బ్యాటరీ ఆకారంలో పసుపు రంగులో ఉన్న రెండు పెద్ద మెటల్ బార్‌లను అధికారులు కనుగొన్నారు. పసుపు రంగు లోహపు గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన బంగారం మొత్తం 1,390.850 గ్రాముల విలువ రూ.1,00,06,909. కస్టమ్స్ చట్టం, 1962లోని నిబంధనల ప్రకారం దానిని స్వాధీనం చేసుకున్నారు. ఫ్లైయర్‌ని అరెస్టు చేశారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది.

Next Story