మరో గ్యాంగ్ స్టర్‌ను అంతం చేసిన యూపీ పోలీసులు

యూపీ పోలీసులు మరో గ్యాంగ్ స్టర్ ను అంతం చేశాడు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగం.. మీరట్‌లో జరిపిన ఎన్‌కౌంటర్‌లో

By అంజి  Published on  4 May 2023 6:00 PM IST
gangster Anil Dujana, encounter, UP Police

మరో గ్యాంగ్ స్టర్‌ను అంతం చేసిన యూపీ పోలీసులు 

యూపీ పోలీసులు మరో గ్యాంగ్ స్టర్ ను అంతం చేశాడు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగం.. మీరట్‌లో జరిపిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా హతమయ్యాడు. దుజానాపై హత్య, దోపిడీ వంటి 62 కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం అనిల్ దుజానా యూపీ పోలీసుల ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ కాల్చి చంపారని అధికారిక ప్రకటన వచ్చింది.

"పశ్చిమ యుపికి చెందిన భయంకరమైన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా, యుపి ఎస్‌టిఎఫ్ మీరట్ యూనిట్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. అతనిపై అనేక కేసులు ఉన్నాయి, అతను కాంట్రాక్ట్ కిల్లర్, అతనిపై 18 హత్య కేసులు ఉన్నాయి," అని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెలిపారు. అనిల్ దుజానా స్కార్పియో కారులో మీరట్‌ కు వెళుతూ ఉండగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో రెండు వైపుల నుండి మొత్తం 21 రౌండ్లు కాల్పులు జరిగాయి, దుజానా 15 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఎన్‌కౌంటర్‌లో హతమైన అనిల్ దుజానా నుంచి 9 ఎంఎం రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు.

Next Story