భార్యను పని మనిషిగా ఇళ్లల్లో పెట్టేవాడు.. ఆ తర్వాత

Delhi police busted a thief gang.ఢిల్లీ పోలీసులు ఓ దొంగల ముఠాను పట్టుకున్నాడు. ఈ ముఠాకు బంగ్లాదేశ్ జాతీయుడు

By M.S.R  Published on  20 Dec 2021 8:35 AM GMT
భార్యను పని మనిషిగా ఇళ్లల్లో పెట్టేవాడు.. ఆ తర్వాత

ఢిల్లీ పోలీసులు ఓ దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు బంగ్లాదేశ్ జాతీయుడు షహదత్ ఖాన్ నాయకుడిగా ఉన్నాడు. మీడియా కథనాల ప్రకారం, షహదత్ తన భార్యను టార్గెట్ చేసిన ఇళ్లకు పనిమనిషిగా పంపేవాడు. ఆపై ఇంట్లో ఉంచిన వస్తువులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించి ఆ ఇంట్లో దోపిడీ చేసి కొల్లగొట్టుకుని వెళ్లిపోయే వాడు. షహదత్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి విమానంలో కూడా ప్రయాణించేవాడని పోలీసులు గుర్తించారు.

బెంగళూరు వెళ్లే విమానాన్ని ఆపి ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని సహచరులు నలుగురిని కూడా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ఢిల్లీకి చెందిన సుభాన్ అలియాస్ సోను, షాహీన్, జావేద్ అలీ, విజయ్ కుమార్‌లుగా గుర్తించారు. వారి నుంచి భారీగా బంగారం, వెండి, నగదు, వాచీలు, మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. జావేద్, విజయ్ దొంగిలించిన వస్తువులను అమ్మేవారు. ఢిల్లీలోని సీమాపురిలోని మురికివాడల్లో షహదత్ నివసించే వాడు. షహదత్ తో పాటూ షాహీన్ కూడా తమ భార్యను పనిమనిషిగా ధనవంతుల ఇళ్లల్లో పనికి కుదిర్చే వారు.

వారి భార్యలు అక్కడ ఇంటి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి.. డబ్బు, పలు వస్తువులను ఎక్కడ ఉంచేవారో తెలుసుకునే వాళ్ళు. ముఠాలోని మిగిలిన సభ్యులు వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించేవారు. ఖాళీగా ఉన్న మెజారిటీ ఇళ్లను టార్గెట్ చేశారు. అర్థరాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడేవారు. దొంగతనం చేసే సమయంలో కుటుంబసభ్యులు మేల్కొని ఉంటే వారిని కిడ్నాప్ చేస్తారు. షహదత్ భార్య సల్మా, షాహీన్ భార్య ఇంకా పట్టుబడలేదు. పోలీసులు వారిని పట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.

Next Story