వెబ్‌సిరీస్‌లు చూసి దారుణం.. సినీ ఫక్కీలో హత్య

కొందరు వ్యక్తులు ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసి హత్యలు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  25 Aug 2024 7:16 AM IST
delhi, murder,   flat,  movies, web series ,

వెబ్‌సిరీస్‌లు చూసి దారుణం.. సినీ ఫక్కీలో హత్య 

కొందరు వ్యక్తులు ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసి హత్యలు చేస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు.. హత్య ఎలా చేయాలనే దానిపై కొన్ని వెబ్‌సిరీస్‌లను చూస్తున్నారు. హత్యలకు పాల్పడి చివరకు కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా ఇలాంఇ సంఘటనే వెలుగులోకి వచ్చింది.

ఓ ఫ్లాట్ కొనుగోలు విషయంలో ఢిల్లీకి చెందిన మాజీ కానిస్టేబుల్, వ్యాపారవేత్త మధ్య వివాదం తలెత్తింది. దాంతో.. సినీ ఫక్కీలో హత్యకు దారి తీసింది. నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకు చెందిన వ్యాపారవేత్త అంకున్‌ శర్మ.. నొయిడా సొసైటీలోని తన ఫ్లాట్‌ను అమ్మాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మాజీ కానిస్టేబుల్‌ ప్రవీణ్ (42)తో రూ.1.20 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.8లక్షలు ప్రవీణ్‌ వ్యాపారవేత్త అంకున్ శర్మకు ఇచ్చాడు కూడా. అయితే.. అనూహ్యం ఆ ఫ్లాట్ విలువ మరింత ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలుసుకున్నాడు అంకున్ శర్మ. లాస్‌ అవుతున్నానని గ్రహించి మాజీ కానిస్టేబుల్‌కు ఫ్లాట్‌ను అమ్మడం లేదని చెప్పాడు. దాంతో.. ప్రవీణ్ సదురు వ్యాపారవేత్తపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా అంకున్ శర్మను అడ్డు తొలగించుకుని.. ఫ్లాట్‌ను సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే పలు క్రైమ్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూశాడు. వాటి స్ఫూర్తితో ఒక పథకం రచించాడు. వ్యాపారి కోరినట్లే సొమ్ము తిరిగి తీసుకుంటానని చెప్పాడు. ఆగస్టు 9వ తేదీన ఇద్దరూ కలిశారు. ఆ తర్వాత అంకున్ శర్మకు మద్యం తాగించాడు. దయం మత్తులో ఉన్న వ్యాపారిని ప్రవీణ్ సుత్తెతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని ఫ్లాట్‌లోనే పాతిపెట్టాడు. చివరకు అంకున్ శర్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

Next Story