రూ.2వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  2 Oct 2024 4:14 PM IST
రూ.2వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ముఠా గుట్టు రట్టు చేశారు అధికారులు. 500 కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన కొకైన్ విలువ మార్కెట్‌లో రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడటంతో కలకలం రేగింది.

కాగా.. ఈ స్మగ్లింగ్‌ కేసులో నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ అరెస్ట్ చేసింది. పక్కా సమాచారంతోనే భారీ మొత్తంలో కొకైన్‌ను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్పెషల్ టీమ్‌ సౌత్ ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. నలుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. నిందితుల నుంచి 560 కిలోలకు పైగా కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు ఆఫ్ఘాన్లను అరెస్ట్ చేశారు. అప్పుడు వారి నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద మొత్తలంగా సరఫరాకు సిద్ధం చేస్తున్న కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు.

Next Story