డిగ్రీ విద్యార్థిని దారుణ‌హ‌త్య‌.. ప్రియుడే యముడు..!

Degree student murder in Guntur District.దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు.డిగ్రీ విద్యార్థిని దారుణ‌హ‌త్య‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2021 3:54 PM IST
Degree student murder in Guntur District

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు. ప్రేమించిన యువ‌తిని ఓ యువ‌కుడు కాలువ గ‌ట్టు వ‌ద్ద‌కు తీసుకువెళ్లి హ‌త్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన కోట అనూష‌(19) అనే యువ‌తి న‌ర‌స‌రావుపేట‌లోని ఓ ప్రైవేట్ క‌ళాశాల‌లో డిగ్రీ 2వ సంవ‌త్స‌రం చ‌దువుతోంది. అయితే.. అనుష‌ను దుండ‌గుడు గొంతు నులిమి చంపివేశాడు. ప‌ట్ట‌ణ శివారు పాల‌పాడు రోడ్డులోని గోవింద‌పురం మేజ‌ర్ కాల్వ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అనంత‌రం అనూష మృత‌దేహాన్ని కాలువ‌లో ప‌డేశాడు.

అనూష హ‌త్య‌పై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాం వ్య‌క్తం చేశారు. మృత‌దేహాంతో పాటు ర్యాలీగా వెళ్లి కూడ‌లిలో బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌ని.. దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. అనూష‌కు అదే కాలేజ్ లో తనతోటి విద్యార్ధి విష్ణువర్ధన్ రెడ్డితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని.. ఈ రోజు ఉదయం కాలేజీ కి వచ్చిన అనూషను విష్ణు వర్ధన్ రెడ్డి క్లాస్ నుండి బయటికి తీసుకు వెళ్ళాడని తోటి విద్యార్ధులు చెబుతున్నారు.

మ‌రో యువ‌కుడితో అనూష ప్రేమ‌లో ఉంద‌ని భావించి హ‌త్య చేసిన‌ట్లుగా తెలుస్తోంది. హత్య చేసిన అనంత‌రం విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.




Next Story