ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

Degree Student committed suicide in adilabad district.ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 6 Jun 2021 4:17 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో  విషాదం.. డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. వేదింపులు తాళ‌లేక డిగ్రీ విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఇంద్ర‌వెల్లి మండ‌లం హ‌ర్కాపూర్ గ్రామంలో రాథోడ్ శ్రీదేవి(21) త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. ప్ర‌స్తుతం శ్రీదేవి డిగ్రీ చ‌దువుతోంది. అయితే.. ఆదివారం ఉద‌యం ఇంట్లో ఎవ‌రు లేని స‌మ‌యంలో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కాగా.. త‌న సోద‌రి మృతికి త‌న భార్య‌, అత్త వేదింపులే కార‌ణ‌మ‌ని మృతురాలి సోద‌రుడు ఇంద్ర‌వెల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వీరి వేధింపుల కారణంగానే యువతి ఆత్మహత్యకు పాల్పడిందా.? లేదా మరేదైనా కారణం ఉందా.? అన్న కోణంలో పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

Next Story