స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న..

Deaf and mute minor girl gang raped.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చినప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Oct 2021 3:21 PM IST
స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న..

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చినప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మూగ, చెవిటి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆ ఘ‌ట‌న‌ను ఫోటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో ఉంచారు.

వివ‌రాల్లోకి వెళితే.. షాదోల్ కొత్వాలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మూగ, చెవిటి బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ యువకుడు ఆ బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి గ్రామ శివార‌ల్లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్క‌డ అత‌డితో పాటు మ‌రో ఐదుగురు ఆ బాలిక‌పై సామూహిత అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఫోటోలు, వీడియోలు తీశారు. అనంత‌రం బాలిక‌ను ఇంటి వ‌ద్ద వ‌దిలివేశారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఆ బాలిక ఎవ‌రితో చెప్పుకోలేక త‌న‌లో తానే కుమిలిపోయింది.

అయితే.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను, వీడియోల‌ను నిందితులు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విష‌యం బాలిక తండ్రికి తెలిసింది. కుమారైను ఆరా తీయ‌గా.. మొత్తం విషయాన్ని సైగ‌ల‌తో చెప్పేసింది. వెంట‌నే బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. పలువురు అనుమానితుల ఫొటోలను బాలికకు చూపించగా నిందితులను గుర్తించింది. ఆరుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో న‌లుగురు మైన‌ర్లేన‌ని పోలీసు సూపరింటెండెంట్‌ అవధేశ్‌ గోస్వామి తెలిపారు. కాగా.. నిందితుల‌ను ఉరి తీయాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story