బ్రిడ్జ్ కింద లగేజీ బ్యాగు.. తెరిచి చూసిన పోలీసులకు షాక్.. సగం మృతదేహం
Dead body found in Luggage Bag in kuppam. ఓ బ్రిడ్జి కింద ఓ లగేజీ బ్యాగును గుర్తించారు. పోలీసులు బ్యాగు తెరిచి చూసిన మృతదేహం కనిపించింది.
By తోట వంశీ కుమార్ Published on 15 April 2021 1:30 PM ISTఅతి ఓ ప్రధాన జాతీయ రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. జనాలు అటు ఇటు తిరుగుతున్నారు. ఓ బ్రిడ్జి కింద ఓ లగేజీ బ్యాగును గుర్తించారు. ఆ బ్యాగు పై ఈగలు, దోమలు వాలుతుండడంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే అనుమానాస్పద స్థితిలో బ్రిడ్జి కింద బ్యాగు ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన పోలీసులు ఆ బ్యాగును బ్రిడ్జి కింద నుంచి పైకి తెచ్చి చూడగా.. అందులో మృతదేహాం కనిపించింది. అది కూడా సగం మాత్రమే. ఈ ఘటన చిత్తూరులో జిల్లాలో చోటుచేసుకుంది.
కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిలోని నడుమూరు గురుకుల పాఠశాల సమీపంలో ఓ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద గురువారం ఉదయం కొందరు ఓ లగేజీ బ్యాగును గుర్తించారు. బ్యాగు అనుమానాస్పద స్థితిలో పడి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద బ్యాగు ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. బ్యాగును తెరిచి చూసి షాక్‌గురయ్యారు. అందులో మృతదేహం కనిపించింది. అది కూడా సగ భాగమే. నడుము భాగం నుంచి దిగువ కాళ్ల వరకు మాత్రమే బ్యాగులో కుక్కి పడేశారు.
25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేసి.. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి నడుము కింద భాగాన్ని ఓ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి దాన్ని లగేజ్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి ఇలా పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా సగభాగం కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికి ప్రమోజనం లేకుండా పోయింది. మృతదేహన్ని ప్రభుత్వసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ చనిపోయింది ఎవరు అనేది తెలిస్తే.. అతడిని చంపింది ఎవరో తెలిసే అవకాశం ఉంది. మృతుడిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లగేజీ బ్యాగులో మృతదేహాం కనిపించడంతో అక్కడ కలకలం రేగింది.