కూతురు చేసిన తప్పుడు ఆరోపణలు వల్ల ఓ తండ్రి ఐదున్నరేళ్ల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తన ప్రేమను ఒప్పుకోలేదని బాలిక తన తండ్రిపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. తండ్రి ఐదున్నర సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాక నిర్దోషిగా విడుదలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని అంధేరీకి చెందిన బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. కొద్ది రోజుల తర్వాత ఈ విషయం తండ్రికి తెలిసింది. బాలిక తన ప్రియుడి కోసం నగలు ధరించుకుని, అందంగా రెడీ అయి వెళ్లేది. ఇది తండ్రికి నచ్చకపోవడంతో బాలికను హెచ్చరించాడు.
అయినా బాలిక తన తండ్రి మాటను బాలిక లెక్క చేయలేదు. ఈ క్రమంలోనే కోపంతో తండ్రి తన కూతురును కొట్టాడు. ఆ కోపంతోనే బాలిక తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిందని కుటుంబ సభ్యులు చెప్పారు. తన తండ్రి తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని 2017లో స్కూల్ టీచర్‌కు బాలిక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. 2016 నుంచి ఏడాది వ్యవధిలో నెలకు 4 సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. అయితే బాలిక చెప్పినవి తప్పుడు ఆరోపణలు అని తెలియక.. టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ ఎన్జీవో సంస్థతో కలిసి డీఎన్ నగర్ పోలీసులకు బాలిక తండ్రిపై ఫిర్యాదు ఇచ్చారు. దీంతో బాలిక తండ్రి 2017లో అరెస్టు అయ్యాడు. అనంతరం బాలిక, టీచర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసి.. బాలికకు వైద్య పరీక్షలు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బాలికపై అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని, మెడికల్ టెస్టుల్లోనూ రేప్ జరిగినట్లు వెల్లడి కాలేదని పోలీసుల విచారణలో తేలింది. బాలిక మానసిక పరిస్థితి బాగోలేక అలా తప్పుడు ఆరోపణలు చేసిందని పోలీసుల విచారణలో తేలడంతో.. బాలిక తండ్రిని కోర్టు నిర్దోషిగా తేల్చింది.