వధువు అత్యుత్సాహాం.. ఒకరి మృతి.. పదుల సంఖ్యలో బంధువులు ఆస్పత్రి పాలు
Dancing bride narrowly escapes death as speeding car crushes others in wedding party.పెళ్లి కూతురు హుషారును చూసిన పెళ్లి కొడుకు బంధువులు కూడా ఆమెతో కాలు కదిపారు.
By తోట వంశీ కుమార్ Published on 18 Feb 2021 11:02 AM ISTకొద్ది గంటల్లో వివాహం జరగనుంది. అక్కడ అంతా సంతోషకర వాతావరణం నెలకొంది. వధువును పెళ్లి మండపానికి కారులో తీసుకువస్తున్నారు. అక్కడి ఏర్పాట్లు చూసి ఆనందో ఆ వధువు కార్ టాప్ ఓపెన్ చేసి డ్యాన్ చేస్తోంది. పెళ్లి కూతురు హుషారును చూసిన పెళ్లి కొడుకు బంధువులు కూడా ఆమెతో కాలు కదిపారు. తాము ఎక్కడ ఉన్నామనే సంగతినే మరిచారు. హైవేపై నడిరోడ్డులో డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతో ఓ కారు వారిపై దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పరిధిలోని నైమండీ ప్రాంతంలో అంకుర్ అనే వ్యక్తితో హేమ అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం(ఫిబ్రవరి 16) తేదీ జరగనున్న పెళ్లికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. డెహ్రాడూన్ హైవే నుంచి నైమండీ ప్రాంతానికి కారులో వధువును తీసుకొస్తున్నారు. వివాహ వేడుక ప్రాంతానికి చేరుకున్న అనంతరం వధువు కారు టాప్ ను తీసి పైకి లేచింది. పెళ్లి దుస్తులు, కళ్లద్దాలు ధరించి మెరిసిపోతున్న వధువు మెల్లిగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అక్కడనే ఉన్న బంధువులు కూడా కారు పక్కనే నిల్చొని డ్యాన్స్ చేశారు. హైవేపై ఇలా చేయడంతో.. ఇతరులకు ఇబ్బంది కలిగింది.
This dance could have been fatal - open sun-roofed car dancing Bride in UP's Muzaffarnagar has a narrow escape after a speeding vehicle hits Baraat on road leaving one dead and many injured @umeshpathaklive @Uppolice pic.twitter.com/hMmzhxTgsV
— Utkarsh Singh (@utkarshs88) February 17, 2021
ఇంతలో అతి వేగంగా వస్తున్న ఓ కారును వీరి మీదికి దూసుకొచ్చింది. వధువు కారు పక్కన నిలబడి వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుడి బంధువు ఒకరు చనిపోగా.. పదుల సంఖ్యలో అతిథులకు గాయాలు అయ్యాయి. వధువు తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.