మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం

Dalit Minor Girl Molested in Unnao.ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

By M.S.R  Published on  16 Feb 2022 7:10 AM GMT
మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన బాధితురాలు ఏడుస్తూ ఇంటికి చేరుకోగా, బాలిక పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు చలించిపోయారు. తెల్లవారుజామున మొరవాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొరవాన్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు మైనర్ బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఉన్నావ్ జిల్లాలోని థానా మొరావాన్ పరిధిలోని లడ్‌ఖేడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మజ్రే అహెస్సాకు చెందిన దళిత కుటుంబానికి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఆదివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో లడ్‌ఖేరా గ్రామంలోని కిరాణా దుకాణంలో చక్కెర తీసుకోవడానికి తన ఇంటి నుండి వెళ్లింది. దుకాణం నుంచి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు మైనర్ బాలికను ఊరి బయట ఉన్న తోటలోకి లాక్కెళ్లారు. అక్కడ మైనర్ బాలికపై ముగ్గురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. మైనర్ బాలిక అరుస్తూ.. ఏడుస్తూ ఉన్నా వారు ఆమెను విడిచిపెట్టలేదు. మైనర్‌పై అత్యాచారం చేసి ముగ్గురు పారిపోయారు. ఎలాగోలా ఏడుస్తున్న బాధితురాలు ఇంటికి చేరుకుని విషయం మొత్తం చెప్పడంతో కుటుంబసభ్యుల రోదనలు విని ఇరుగుపొరుగు వారు కూడా గుమిగూడారు. ఉదయం 13 ఏళ్ల బాలిక కుటుంబం థానా మొరవాన్ చౌక్‌కు చేరుకుని కేసు నమోదు చేసింది.కేసు నమోదు చేశామని, మెడికల్ రిపోర్టు రాగానే విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పూర్వా పంకజ్ సింగ్ తెలిపారు.

Next Story
Share it