సిలిండర్ పేలి ఏడుగురు మృతి
Cylinder blast in UP seven members died.ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి గోండాలోని
By తోట వంశీ కుమార్ Published on
2 Jun 2021 5:57 AM GMT

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి గోండాలోని తిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఏడుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద 14 మందిని రక్షించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
సిలిండర్ పేలి 2 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని.. ఏడుగురు మరణించగా.. శిథిలాల కింద చిక్కుకున్న మరో 14 మందిని సహాయక సిబ్బంది ఎస్పీ సంతోష్‌కుమార్ మిశ్రా తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Next Story