విషాదం.. సిలిండ‌ర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు స‌జీవ ద‌హ‌నం

Cylinder Blast 6 members of a family burnt alive.హ‌ర్యానా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2023 10:24 AM IST
విషాదం.. సిలిండ‌ర్ పేలి ఒకే కుటుంబానికి  చెందిన ఆరుగురు స‌జీవ ద‌హ‌నం

హ‌ర్యానా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పానిప‌ట్ జిల్లాలో ఓ ఇంట్లో సిలిండర్ పేల‌డంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ‌ద‌హ‌నం అయ్యారు.

పానిపట్‌లోని త‌హ‌సీల్ క్యాంపు ప్రాంతంలో ఓ కుటుంబం అద్దెకు ఉంటుంది. ఈ రోజు(గురువారం) ఉద‌యం వంట చేస్తుండ‌గా సిలిండ‌ర్‌ భారీ శ‌బ్ధంతో సిలిండ‌ర్ పేలి పోయిన‌ట్లు అధికారులు తెలిపారు. ఇంటికి మంట‌లు అంటుకోవ‌డంతో ఆ కుటుంబంలోని ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌లను అదుపులోకి తీసుకువ‌చ్చారు. మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. సిలిండ‌ర్‌కు మంట‌లు ఎలా అంటున్న‌కున్నాయ‌న్న సంగ‌తి తెలియ‌రాలేదు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్‌లోని సత్నాలో సిలిండర్ పేలిన హృదయాన్ని కదిలించే ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆదివారం ఉదయం ఓ రెస్టారెంట్‌లో ఉంచిన గ్యాస్‌ సిలిండర్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదకరమైన పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్‌గా మారింది.

Next Story