ఆ అధికారుల ఫేక్ అకౌంట్స్ తో జాగ్రత్త

సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులకు సంబంధించిన ఫేక్ అకౌంట్స్ తో కొందరు కేటుగాళ్లు ప్రజలను ఎప్పటికప్పుడు బురిడీ కొట్టిస్తూ ఉంటారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jan 2024 5:44 AM GMT
Cybercriminals, fake profiles, IPS officers, CV Anand , Swati Lakra

ఆ అధికారుల ఫేక్ అకౌంట్స్ తో జాగ్రత్త 

సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులకు సంబంధించిన ఫేక్ అకౌంట్స్ తో కొందరు కేటుగాళ్లు ప్రజలను ఎప్పటికప్పుడు బురిడీ కొట్టిస్తూ ఉంటారు. సినిమా స్టార్స్ దగ్గర నుండి పొలిటికల్ లీడర్స్, ఐఏఎస్-ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ఫేక్ అకౌంట్స్ చాలానే కనిపిస్తూ ఉంటాయి. కొందరు ఒరిజినల్ ఏవీ.. ఫేక్ ఏవీ అనే తేడా తెలియకుండా ఆయా అకౌంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని ఫేక్ అకౌంట్లు అమాయకులను నిలువునా మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, అధికారులు, న్యూస్ మీటర్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది.

తాజాగా తెలంగాణలో ఇద్దరు ప్ర,ముఖ అధికారులకు సంబంధించిన ఫేక్ అకౌంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రెండు వేర్వేరు కేసుల్లో మోసపూరితమైన ఉద్దేశ్యంతో క్రియేట్ చేసిన అధికారుల ప్రొఫైల్‌లను కనుగొన్నారు. తెలంగాణకు చెందిన ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్, ఐపీఎస్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ప్రొఫైల్‌ల గురించి యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఇన్‌స్పెక్టర్ వై. ప్రేమ్‌కుమార్ ఫిర్యాదు చేశారు.

స్వాతి లక్రా ఐపీఎస్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ ఖాతా గురించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కె.సాగర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రొఫైల్, కవర్ ఫోటోలుగా స్వాతి లక్రా చిత్రాలను ఉపయోగించారు. 138 మంది స్నేహితులు కూడా అందులో ఉన్నారు. ఇది కూడా నకిలీ ఖాతానే!! సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ రెండు అకౌంట్లకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు శనివారం నాడు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ అకౌంట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు సంబంధిత అధికారుల లాగా వ్యవహరిస్తూ పలువురిని మోసం చేసే అవకాశం ఉంది

Next Story