ఖమ్మం జిల్లా దారుణం జరిగింది. సీపీఎం నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం రైతు సంఘం నాయకుడు, మాజీ సర్పంచ్ సామ్నేని రామారావును గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దుండగులు అతని గొంతు కోసి, అక్కడికక్కడే చంపేశారు. ఇవాళ ఉదయం పాతర్లపాడులో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన రామారావును దుండగులు గొంతుకోచి చంపేశారు.   
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మరో మూడు రోజుల్లో మనవరాలు మ్యారేజ్ ఉండగా రామారావు హత్యకు గురవడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, పాతర్లపాడు గ్రామ సర్పంచ్‌గా రామారావు పనిచేశారు.