కోడలి పట్ల అత్త అమానుషం..
Covid-19 patient behaves like sadist.కరోనా మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. అత్తకు కరోనా రావడంతో కోడలు సామాజిక
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2021 1:11 PM ISTకరోనా మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. అత్తకు కరోనా రావడంతో కోడలు సామాజిక దూరం పాటిస్తూ ఆమెకు సేవలు చేస్తోంది. అయితే.. కోడలు సామాజిక దూరం పాటించడాన్ని అత్త భరించలేకపోయింది. తరుచూ కోడలిని కౌగిలించుకుంటూ ఆమెకు కూడా కరోనా సోకేలా చేసింది. కోడలికి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే ఆమెను ఇంట్లోంచి గెంటేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్లలో చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్టతండావాసితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. బాధితురాలి భర్త బతుకుదెరువు కోసం ఏడు నెలల కిందట ఒడిశా వెళ్లి అక్కడే ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అత్త కరోనా బారినపడగా హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. కోడలు బౌతిక దూరాన్ని పాటించడాన్ని అత్త జీర్ణించుకోలేకపోయింది.
నేను చనిపోతే మీరు హాయిగా బతుకుతారా అంటూ.. కోడలిని తరచూ ఆలింగనం చేసుకోవడం, పిల్లలను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం చేసేది. దీంతో కోడలికి సైతం మూడు రోజుల కిందట కరోనా సోకింది. వెంటనే కోడలిని అత్త ఇంట్లోంచి గెంటివేసింది. చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూపలేదు. ఈ దారుణాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అత్తాకోడలు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.