పదో తరగతి బాలిక పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన

Constable Harassed 10th class girl in Guntur.దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2021 5:42 AM GMT
పదో తరగతి బాలిక పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కామాంధులు క‌న్నుమిన్ను కాన‌డం లేదు. ఇక మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన ర‌క్ష‌క భ‌టులే ఓ ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌పై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టడానికి య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన పోలీసు వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది.

వివ‌రాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమేష్ 2019లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. గుంటూరులోని కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. కుటుంబంతో క‌లిసి ఓ ఇంట్లో పై అంత‌స్తులో అద్దెకు ఉంటున్నాడు. కింద మ‌రో కుటుంబం నివ‌సిస్తోంది. ఆ కుటుంబంలో పదో త‌ర‌గ‌తి చ‌దువుత‌న్న బాలిక ఉంది. ఆ బాలిక‌తో గ‌త కొద్ది రోజులుగా ర‌మేశ్ చ‌నువుగా మాట్లాడుతున్నాడు. గ‌మ‌నించిన బాలిక కుటుంబ స‌భ్యులు.. త‌మ కుమారైతో మాట్లొద్ద‌ని హెచ్చరించింది.

కాగా.. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేక సమయం చూసి, కానిస్టేబుల్ ఆ బాలికను పిలిపించాడు. తెలిసిన వ్య‌క్తి కావ‌డంతో ఆ బాలిక ఇంట్లోకి వెళ్లింది. ఆ బాలిక ప‌ట్ల ర‌మేశ్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. గ‌మ‌నించిన బాలిక కుటుంబ స‌భ్యులు.. అత‌డికి దేశ‌శుద్ది చేసి.. దిశ పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌ చేసి.. ర‌మేశ్‌ను సస్పెండ్ చేస్తూ అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Next Story
Share it